కీర్తి కి నిజంగానే ఝలక్ ఇస్తారా?
గత రెండు రోజులుగా మహేష్ సర్కారు వారి పాట సినిమా నుండి హీరోయిన్ కీర్తి సురేష్ ని తప్పించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియానే కాదు, ఫిలింనగర్ ని [more]
గత రెండు రోజులుగా మహేష్ సర్కారు వారి పాట సినిమా నుండి హీరోయిన్ కీర్తి సురేష్ ని తప్పించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియానే కాదు, ఫిలింనగర్ ని [more]
గత రెండు రోజులుగా మహేష్ సర్కారు వారి పాట సినిమా నుండి హీరోయిన్ కీర్తి సురేష్ ని తప్పించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియానే కాదు, ఫిలింనగర్ ని ఊపేస్తోంది. మొట్టమొదటిసారి కీర్తి సురేష్ కి మహేష్ సరసన నటించే అవకాశం వచ్చింది. అసలు సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ హీరోయిన్ విషయం అధికారిక ప్రకటన ఇవ్వకుండానే ఏదో ఎగ్జైట్ కొద్దీ కీర్తి సురేష్ తాను మహేష్ సరసన నటించబోతున్నట్టుగా ప్రకటించేసింది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట నుండి కీర్తి సురేష్ ని తప్పించే ఏర్పాట్లు మొదలయ్యాయి అనే టాక్ మొదలయ్యింది.
కారణం కీర్తి సురేష్ బాగా నాజూగ్గా సన్నగా తయారవడమే అంటున్నారు. మహానటి ఫేమ్ అయితే ఇచ్చింది కానీ.. మహానటి కోసం పెరిగిన బరువు వలన కీర్తి సురేష్ రెండేళ్ల కెరీర్ లో వెనకబడింది. ఆమె బరువు ఆమెకి శాపమైంది. అందుకే కీర్తి సురేష్ విపరీతంగా వర్కౌట్స్, యోగ గట్రా చేసి సన్నగా తయారయ్యింది. సన్నాబడాలని తాపత్రయంలో కీర్తి సురేష్ తన గ్లో మొత్తం పోగొట్టుకుంది. కీర్తి సన్నగా నాజూగ్గా బావుంది కానీ.. ఫేస్ లో గ్లో కోల్పోయింది. కీర్తి సురేష్ ని మహేష్ కోసం హీరోయిన్ గా తీసుకోబోతున్నారనే న్యూస్ చూడగానే మహేష్ ఫ్యాన్స్ బాగా వర్రీ అయ్యారు. ఇక అందరూ బాలీవుడ్ హీరోయిన్స్ చుట్టూ తిరుగుతుంటే మీరేమిటి కీర్తి ని తీసుకున్నారని మహేష్ ఫ్యాన్స్ ప్రెజర్ చెయ్యడం వలన పరశురామ్ కీర్తిని సర్కారు వారి పాట నుండి తప్పించబోతున్నాడనే ప్రచారం అయితే మాములుగా లేదు. అయితే చిత్ర బృందం నుండి అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేషే మహేష్ హీరోయిన్.. అందులో ఎలాంటి మార్పు లేదంటున్నారు.