మహేష్ ప్లానింగ్ వేరయా?
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఒక్క టీజర్ తో కావాల్సినంత క్రేజ్ సంపాదించినా సరిలేరు నీకెవ్వరూ ఇప్పుడు ప్రతి సోమవారం ఒక్కొక్క [more]
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఒక్క టీజర్ తో కావాల్సినంత క్రేజ్ సంపాదించినా సరిలేరు నీకెవ్వరూ ఇప్పుడు ప్రతి సోమవారం ఒక్కొక్క [more]
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఒక్క టీజర్ తో కావాల్సినంత క్రేజ్ సంపాదించినా సరిలేరు నీకెవ్వరూ ఇప్పుడు ప్రతి సోమవారం ఒక్కొక్క సాంగ్ ని వదలడానికి రేడి అయ్యారు. ఐదు పాటలకు ఐదు సోమవారాలు టార్గెట్ గా ప్రమోషన్స్ ని మొదలెట్టిన మహేష్ సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడట. అనిల్ రావిపూడి, నిర్మాతలు కూడా మహేష్ తో కలిసి డిస్కస్ చేసి మరీ ప్రమోషన్స్ ని పక్కా ప్లానింగ్ తో ముందుకుతీసుకెలుతున్నారు.
ఇక జనవరి 11 న సినిమా విడుదల అవుతుంది. దానికి ముందు వారం అంటే జనవరి 5 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఆదివారం అయితే భారీగా జనాలు ఈవెంట్ కి హాజరవడం సినిమా ముందు ఈ ఫంక్షన్ చేస్తే.. సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని భవిస్తున్నారట. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ రావొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. మరి సోమవారం ప్రమోషన్స్ తో మహేష్ ఫ్యాన్స్ కి పూనకలొచ్చేస్తే… ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంకెంత రెచ్చిపోతారో చూడాలి.