మైండ్ బ్లాంక్ సాంగ్ తమన్నాతో కాదా?
మహేష్ – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా సందడి మాములుగా లేదు, టీజర్ సాంగ్స్ అంటూ భీభత్సమైన హడావిడి మొదలైపోయింది. సరిలేరు నీకెవ్వరూ మండే స్పెషల్ [more]
మహేష్ – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా సందడి మాములుగా లేదు, టీజర్ సాంగ్స్ అంటూ భీభత్సమైన హడావిడి మొదలైపోయింది. సరిలేరు నీకెవ్వరూ మండే స్పెషల్ [more]

మహేష్ – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా సందడి మాములుగా లేదు, టీజర్ సాంగ్స్ అంటూ భీభత్సమైన హడావిడి మొదలైపోయింది. సరిలేరు నీకెవ్వరూ మండే స్పెషల్ అంటూ… వారినికో సాంగ్ ని యూట్యూబ్ లో వదులుతుంది యూనిట్. ఐదు సోమవారాలు ఐదు సాంగ్స్ ని వదలడానికి ప్లాన్ చెయ్యడం, అందులో మొదటి మండే మైండ్ బ్లాంక్ సాంగ్ ని విడుదలచెయ్యడం జరిగింది. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న సరిలేరు మొదటి సాంగ్ మాస్ ప్రేక్షకులు మెచ్చేదిలా ఉన్నప్పటికీ.. దేవిశ్రీ మరీ రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడంటూ… మ్యూజిక్ లవర్స్ పెదవి విరిచారు.
అయితే మైండ్ బ్లాంక్ సాంగ్ ఐటెం సాంగ్ అనుకున్నారు అంతా. ఎందుకంటే అనిల్ రావిపూడి హాట్ హీరోయిన్ తమన్నా తో ఓ ఐటెం ప్లాన్ చేసినట్లుగా అందరికి తెలియడంతో.. నిన్న విడుదలైన సాంగ్ ఐటెం సాంగ్ అని ఈ ఐటెం లో తమన్నా మహేష్ మాస్ స్టెప్స్ ఉంటాయనుకుని మహేష్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అయితే నిన్న మండే వదిలిన మైండ్ బ్లాంక్ సాంగ్ ఐటెం సాంగ్ కాదని, తమన్నాతో ఐటెం కాదని, రష్మిక – మహేష్ లతోనే ఈ మాస్ బీట్ తీసారని, తమన్నాతో ఐటెం సాంగ్ ని చివరి మండే లో వదులుతారని అంటున్నారు. అది కూడా ప్రీ క్లిమక్స్ ముందు తమన్నా ఐటెం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. హైలెట్ అనుకున్న సాంగ్స్ ని చివరిలో వదిలి, కొద్దిగా డల్ సాంగ్స్ ని ముందుగా వదిలే ప్లాన్ చేసినట్లుగా టాక్.

