మళ్ళీ స్టూడెంట్ గానా..?
మహేష్ బాబు ఇప్పటికి యంగ్ గానే ఉంటాడు. నలభై ఏళ్ళు దాటినా మహేష్ ఇంకా నూనూగు మీసాల కుర్రాడిలా మెరిసిపోతూనే ఉంటాడు. అంత హ్యాండ్ సం మహేష్ [more]
మహేష్ బాబు ఇప్పటికి యంగ్ గానే ఉంటాడు. నలభై ఏళ్ళు దాటినా మహేష్ ఇంకా నూనూగు మీసాల కుర్రాడిలా మెరిసిపోతూనే ఉంటాడు. అంత హ్యాండ్ సం మహేష్ [more]
మహేష్ బాబు ఇప్పటికి యంగ్ గానే ఉంటాడు. నలభై ఏళ్ళు దాటినా మహేష్ ఇంకా నూనూగు మీసాల కుర్రాడిలా మెరిసిపోతూనే ఉంటాడు. అంత హ్యాండ్ సం మహేష్ బాబు. మహేష్ మాస్ కంటే క్లాస్ గానే అదరగొట్టేసాడు. లుక్ పరంగాను మహేష్ యంగ్ లుక్ తోనే కనబడతాడు. అయితే మహేష్ ఇప్పటికి కాలేజీ స్టూడెంట్ అంటే నమ్మేశేలా ఉంటాడు. అందుకే కొరటాల శ్రీమంతుడు, వంశి పైడిపల్లి మహర్షి సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా చూపించాడు. కొద్దిసేపే అయినా.. మహేష్ స్టూడెంట్ గా అదరగొట్టేసాడు, అయితే తాజాగా మహేష్ బాబు మరోమారు స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడట.
అది కూడా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ ని కొద్దిసేపు కాలేజ్ స్టూడెంట్ గా చూపించబోతున్నాడట. పరశురామ్ మహేష్ కోసం రాసిన కథ ప్రకారం హీరోయిన్ తో మహేష్ రొమాంటిక్ యాంగిల్ కాస్త ఎక్కువగా ఉండబోతుంది అని…. దానిలో భాగం గానే మహేష్ ని కొద్దిసేపు స్టూడెంట్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. అందుకోసం మహేష్ మేకోవర్ మాములుగా ఉండదని.. పరశురామ్ సినిమాలో యంగ్ అండ్ డైనమిక్ గా మహేష్ ని పరశురామ్ చూపించబోతున్నాడని.. కరోనా లాక్ డౌన్ ముగియగానే మహేష్ – పరశురామ్ మూవీ మొదలు కాబోతుందని తెలుస్తుంది.