మహేష్ – అనిల్ సినిమాలో ట్రైన్ సీన్ హైలైట్ అంట
వరస హిట్స్ తో టాప్ డైరెక్టర్ స్థానానికి ఎగబాకుతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ [more]
వరస హిట్స్ తో టాప్ డైరెక్టర్ స్థానానికి ఎగబాకుతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ [more]

వరస హిట్స్ తో టాప్ డైరెక్టర్ స్థానానికి ఎగబాకుతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరికి తెలిసిందే.
అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ట్రైన్ నేపథ్యంలో వచ్చే కామెడీ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్ కోసం అనిల్ బాగా రాసుకున్నాడని తెలుస్తుంది. గతంలో రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది.
ఆ ట్రైన్ ఎపిసోడ్ ను చాలామంది ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ ఎపిసోడ్ లో రవితేజ అండ్ గ్యాంగ్ ఒక రేంజ్ లో నవ్వులు పూయిస్తారు. బ్రహ్మానందం తో రవితేజ చేసే కామెడీ ఇప్పటికి తలుచుకుంటే నవ్వొస్తూనే ఉంటుంది. అటువంటి ఎపిసోడ్ కి ఒకటి ప్లాన్ చేసాడు అంట అనిల్ రావిపూడి. ట్రైన్ ఎపిసోడ్ మహేశ్ బాబు .. బండ్ల గణేశ్ .. శ్రీనివాస రెడ్డి తదితరులపై ఉంటుందని అంటున్నారు. ప్రసుతం మహర్షి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ వచ్చే నేలనుండి ఈసినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ పాల్గొననున్నాడు
