ఓవర్సీస్ లో 'మహానటి' హవా!

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా అదే జోరు కొనసాగిస్తూ 'మహానటి' చిత్రం ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది.ఇప్పటికే అమెరికాలో మిలియన్ మార్క్ ను దాటిన 'మహానటి' ఇతర ప్రాంతాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది.
అన్ని దేశాల్లో అదే జోరు
తొలి రోజుల్లో ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1,25,900 డాలర్లు (64.03 లక్షల రూపాయలు), యూకేలో 28,373 పౌండ్లు (25.90 లక్షల రూపాయలు), న్యూజిల్యాండ్లో 9,899 డాలర్లు ( 4.65 లక్షల రూపాయల) వసూళ్లు సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం చేసాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా వచ్చింది. అశ్వనిదత్ కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్లు ఈ సినిమాను నిర్మించారు.