Sun Feb 01 2026 23:00:21 GMT+0000 (Coordinated Universal Time)
నటి మాధురీ దీక్షిత్ ఇంట విషాదం
ఈ విషయాన్ని మాధురి, ఆమె భర్త శ్రీరామ్ వెల్లడించారు. ‘‘కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు’’

ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలతా దీక్షిత్ (91) కన్నుమూశారు. ఈ విషయాన్ని మాధురి, ఆమె భర్త శ్రీరామ్ వెల్లడించారు. ‘‘కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు’’ అని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వర్లీలోని శ్మశాన వాటికలో స్నేహలత భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. స్నేహలత అనారోగ్యంతో కన్నుమూశారా ? లేక మరేదైనా కారణం ఉందా ? అన్నది తెలియరాలేదు.
గతేడాది తన తల్లి 90వ పుట్టినరోజు సందర్భంగా మాధురి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. తల్లికి మించిన ఆప్తమిత్రులు కుమార్తెలకు ఉండరని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
Next Story

