Sun Dec 08 2024 21:46:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకప్ కాలేదట.. క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ల మధ్య ఇంకా లవ్ ట్రాక్ ప్రారంభం కాలేదు. అయితే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తన లవ్ [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ల మధ్య ఇంకా లవ్ ట్రాక్ ప్రారంభం కాలేదు. అయితే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తన లవ్ [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ల మధ్య ఇంకా లవ్ ట్రాక్ ప్రారంభం కాలేదు. అయితే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తన లవ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నాగార్జునకు కొందరు కంటెస్టెంట్లు షణ్ముఖ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. షణ్ముఖ్ దిండుపైన అతని లవర్ పేరు ఉంటుందని చెప్పారు. ఎవరు నీ లవర్ అని నాగ్ ప్రశ్నించగా దీప్తి అని సమాధానమిచ్చాడు. గత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అయిన దీప్తి సునయనతో షణ్ముఖ్ జస్వంత్ లవ్ లో పడ్డాడు. కొన్ని ఏళ్లుగా సాగుతున్న ఈ లవ్ బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తన లవర్ దీప్తి సునయన అని చెప్పి వదంతులకు తెరదించాడు.
Next Story