Fri Dec 05 2025 16:12:54 GMT+0000 (Coordinated Universal Time)
ఏఆర్ రెహమాన్ ఫిలిం స్టూడియోలో ప్రమాదం..
అక్కడ రెగ్యులర్ గా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆ స్టూడియోలో తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ప్రముఖ గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కు చెందిన ఫిలిం స్టూడియోలో ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో ఆయనకు సొంత ఫిలిం స్టూడియో ఉంది. దానిని షూటింగ్ లకు రెంట్ కి ఇస్తుంటారు రెహమాన్. అక్కడ రెగ్యులర్ గా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆ స్టూడియోలో తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం 30 అడుగుల ఎత్తులో లైట్ బిగిస్తుండగా.. కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు క్రింద పడ్డాడు.
వెంటనే అతడిని.. సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ.. బాగా ఎత్తు నుండి పడటంతో.. అతను మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఫిలిం స్టూడియోలో జరిగిన ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

