Thu Dec 18 2025 23:05:16 GMT+0000 (Coordinated Universal Time)
డింపుల్ హయతికి ప్రాణహాని ?
డింపుల్ పై తప్పుడు ఫిర్యాదు చేశారని వాపోయారు. FIRలో డింపుల్ డీసీపీ కారు కవర్ తొలగించినట్లు పేర్కొన్నారు.

హీరోయిన్ డింపుల్ హయతి పేరు రెండురోజులుగా వార్తల్లో మారుమ్రోగుతోంది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఆమె తన కారుతో ఢీ కొట్టి, కాలితో తన్నిందంటూ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా డింపుల్ హయతికి ప్రాణహాని ఉందంటూ ఆమె తరపు లాయర్ పాల్ సత్యనారయణ తెలిపారు. డీసీపీ కావాలని ఆమెను వేధిస్తున్నారని, గతంలో ఆయనపై కంప్లైట్ చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు.
డింపుల్ పై తప్పుడు ఫిర్యాదు చేశారని వాపోయారు. FIRలో డింపుల్ డీసీపీ కారు కవర్ తొలగించినట్లు పేర్కొన్నారు. అదే నిజమైతే సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని పాల్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. డీసీపీ తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు అబద్ధాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. డీసీపీ తనతో తప్పుగా బిహేవ్ చేస్తుంటే గతంలో డింపుల్ వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా తట్టుకోలేకనే ఆమెపై తప్పుడు కేసు బనాయించారని, ఫాల్స్ అలిగేషన్స్, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. 41a section కింద కేసు ఉందన్నారు. డీసీపీతో పార్కింగ్ వివాదం తర్వాత.. డింపుల్ కి గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్ చేస్తున్నారన్నారు. నిన్న ఎవరో ఫ్యాన్స్ అంటూ ఇంట్లోకి వచ్చారని, వారిపై 100కి డయల్ చేసి ఫిర్యాదు చేశామన్నారు. డింపుల్ కి ప్రాణహాని ఉందని, అందుకే ఆమె బయటకు వచ్చేందుకు భయపడుతోందన్నారు. డింపుల్ - డీసీపీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంటే.. ఇంతవరకూ డీసీపీ ఈ వివాదంపై స్పందించకపోవడం గమనార్హం.
Next Story

