Sat Mar 07 2026 17:33:25 GMT+0530 (India Standard Time)
తెలుగు సాహిత్యంపై గౌరవం పెంచింది అతనే
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గుర్తు చేసుకున్నారు.

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఘన నివాళలర్పించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎన్నో అద్భుతమైన పాటలు రాశారన్నారు. తన సంగీత దర్శకతంలో వచ్చిన ఆయన పాటలను విని తానే పులకించి పోయాయని ఇళయరాజా తెలిపారు. ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయన్నారు ఇళయరాజా.
సీతారాముడూ....
వేటూరి సుందరరామ్మూర్తి తనకు సాహిత్యంపై ప్రేమను పెంచితే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సాహిత్యంపై గౌరవం పెంచారన్నారు. అటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి శివైక్యం కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఇళయరాజా సానుభూతిని ప్రకటించారు. "సీతారాముడూ ధన్యోస్మి మిత్రమా" అంటూ ఇళయరాజా కన్నీటి వీడ్కోలు పలికారు.
Next Story

