Sun Apr 05 2026 08:17:12 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ లో విషాదం...కొడుకు సినిమా రిలీజ్ కాకముందే మృతి
ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మృతి చెందారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.

ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మృతి చెందారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. కేఎస్ నాగేశ్వరరావు అనేక తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాగేశ్వరరావుకు ఫిట్స్ రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఏలూరులోని ఒక ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. నాగేశ్వరరావు హైదరాబాద్ కు వస్తుండగా ఫిట్స్ వచ్చాయి. ఆయనను వెంటనే ఆసుపత్రిలోకి చేర్చినా ప్రయోజనం లేకపోయింది.
అనేక చిత్రాలకు.....
కేఎస్ నాగేశ్వరరావు 1986లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. రిక్షా రుద్రయ్య సినిమాతో ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత శ్రీశైలం, సాంబయ్య, దేశద్రోహి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తన కుమారుడుతో సినిమాను ప్రారంభించారు. సినిమా పూర్తికాకముందే నాగేశ్వరరావు మరణించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Next Story

