Sun Jul 20 2025 00:57:10 GMT+0000 (Coordinated Universal Time)
క్రేజీ అప్ డేట్.. ఈ చిత్రం పేరు బయటకు వచ్చేసిందిగా?
మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీకి సంబందించిన తాజా అప్ డేట్ వచ్చేసింది

మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీకి సంబందించిన తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు "వెంకట రమణ", "ఆనంద నిలయం" అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా ఈ పేరును ఖరారు చేయకపోయినప్పటికీ త్వరలో ఈ రెండింటిలో ఒక పేరును మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేశ్ కాంబినేషన్ లో వచ్చే మూవీకి ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో దీనిపై ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది.
త్వరలో షూటింగ్...
వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ లో జోరు మీదుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్ తో ఈ మూవీని ఎక్కడికో తీసుకెళతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చినట్లు టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. బహుశా ఆగస్టు లేదా సెప్టంబరు నెలలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేసినట్లు కూడా మరో అప్ డేట్ విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ ను ఊరిస్తుంది.
ఇద్దరు హీరోయిన్లు...
ఇందులో త్రిష తో పాటు నిధి అగర్వాల్ పేర్లను పరిశీలిస్తున్నారని ఫిలింనగర్ వర్గాల టాక్. ఆరు పదుల వయసులో ఉన్న వెంకటేశ్ కు తగిన జోడీ కోసం ఇంకా హీరోయిన్ ఖరారు కాకపోయినప్పటికీ మరో పేరు పేరు కూడా వినిపిస్తుంది. రుక్మిణీ వసంత్ ను కూడా ఇద్దరు హీరోయిన్లలో ఒక్కరిని ఎంపిక చేస్తారని బలంగా చెబుతన్నారు. ఈ చిత్రాన్ని హాసిని అండ్ హాసిని సంస్థ నిర్మిస్తుంది. పూర్తి స్థాయి కామెడీ, కథనంతో వెలువడే చిత్రంలో సెంటిమెంట్ కూడా బలంగానే ఉంచేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నాని చెబుతున్నారు. మొత్తం మీద ఈ మూవీతో విక్టరీ వెంకటేశ్ మరో హిట్ కొట్టడం ఖాయమన్నది టాలీవుడ్ వర్గాల బలమైన అభిప్రాయంగా ఉంది.
Next Story