Fri Dec 05 2025 11:39:27 GMT+0000 (Coordinated Universal Time)
Akhanda : అఖండ - 2 మూవీపై అదిరిపోయే అప్ డేట్ ఇదే
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ - 2 మూవీకి సంబంధించి తాజాగా బిగ్ అప్ డేట్ వచ్చింది

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ - 2 మూవీకి సంబంధించి తాజాగా బిగ్ అప్ డేట్ వచ్చింది. నటసింహం బాలయ్య బాబు నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ ను అభిమానులు ఆసక్తిగా పరిశీలిస్తారు. బాలకృష్ణ, బోయపాటి, తమన్ కాంబినేషన్ లో వచ్చే మూవీ కావడంతో ముందుగానే భారీ బజ్ ఏర్పడింది. ఆరు పదుల వయసులోనూ యువతరం హీరోలకు పోటీగా నిలుస్తున్న బాలయ్య బాబు అఖండ మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో దాని సీక్వెల్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని నమ్ముతున్నారు.
ముందుగానే హైప్ క్రియేట్ అయి...
అఖండ -2 కు అంచనాలు మూవీ ప్రకటించగానే భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించి బోయపాటి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లి మరీ కొన్ని సీన్స్ ను చిత్రీకరించి వచ్చారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కూడా అదిరిపోయాయి. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై అఖండ - 2 మూవీని నిర్మిస్తున్నారు. వరస హిట్లు కొడుతున్న బాలయ్య బాబుకు మరో హిట్ చేరువలో ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
ప్రయాగ్ రాజ్ లో...
అఖండ - 2 మూవీని ఈ ఏడాది సెప్టంబరు 25వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ మూవీకి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. కుంభమేళా జరిగిన ప్రయాగ్ రాజ్ లోనే షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారట. ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు సంబంధించి బోయపాటి అక్కడకు వెళ్లి కుంభమేళా జరుగుతున్న సమయంలో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు బాలయ్యతో అక్కడ షూటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. రెండు వారాల షూటింగ్ పూర్తయితే ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని మేకర్స్ చెబుతున్నారు.
Next Story

