Sat Mar 21 2026 06:32:37 GMT+0530 (India Standard Time)
Chandramohan : చివరి చూపు కోసమే... అంత్యక్రియలు ఆలస్యం
ప్రముఖ సినీహీరో చంద్రమోహన్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి

ప్రముఖ సినీహీరో చంద్రమోహన్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. శనివారం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన చంద్రమోహన్ కు సోమవారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. చంద్రమోహన్ పార్థీవదేహాన్ని చూసేందుకు వేలాది మంది ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. అనేక మంది ఆయన మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు తమ సంతాపానని తెలియచేస్తున్నారు.
పెద్దకుమార్తె కోసం...
అయితే మరణించిన మూడో రోజు చంద్రమోహన్ అంత్యక్రియలను నిర్వహించడానికి పెద్ద కుమార్తె అమెరికా నుంచి రావడమే కారణమని చెబుతున్నారు. చంద్రమోహన్ కు ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె మధుర మీనాక్షి అమరెరికాలో ఉంటున్నారు. ఆమె అమెరికాలో సైకాలజిస్టుగా పనిచేస్తున్నారు. చిన్న కూతురు మాధవి మాత్రం చెన్నైలోనే ఉన్నారు. అయితే మధుర మీనాక్షి అమెరికా నుంచి రావడానికి ఆలస్యం కావడంతో ఆయన అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.
Next Story

