స్టార్ కిడ్స్ కి అలా.. మాకు ఇలా?
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. తల్లితండ్రుల బ్యాగ్రౌండ్ తో సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఒక సినిమా కాకపోతే.. మరో [more]
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. తల్లితండ్రుల బ్యాగ్రౌండ్ తో సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఒక సినిమా కాకపోతే.. మరో [more]
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. తల్లితండ్రుల బ్యాగ్రౌండ్ తో సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఒక సినిమా కాకపోతే.. మరో సినిమా అన్నట్టుగా ఉంటారు. కానీ ఎటువంటి నేపథ్యం లేని వారు సినిమాల్లో నిలదొక్కుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్క సినిమా ప్లాప్ అయినా.. వారు మళ్ళీ సినిమాల్లో కనబడరు. తెలుగులో 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ కి జోడిగా నటించిన కృతి సనన్ కి తెలుగులో అవకాశాలు లేవు కానీ… బాలీవుడ్ లో చిన్న చితక సినిమాల్తో నెట్టుకొస్తోంది. కరోనా లాక్ డౌన్ తో ఫ్రీ అయిన కృతి సనన్… సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎన్ని కష్టాల్లో పడిందో.. ఏకరువు పెడుతుంది. సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వస్తే.. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని చెబుతుంటారు. అందరూ జడ్జ్ చేస్తూనే ఉంటారు.
పరిస్థితులకు తగ్గట్టుగా మనని మనం మార్చుకోవాలని… పరిస్థితులకు తగ్గట్టుగా డ్రస్సింగ్ స్టయిల్, లుక్స్ మారిపోతుండాలని.. ఓసారి మీటింగ్స్ కోసం బట్టల కోసం మేనేజర్ తో కలిసి మాల్ కి వెళ్లగా.. అక్కడ నా డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదనే నన్ను ఇష్టపడడం లేదని.. అనిపించింది. మన డ్రెస్సింగ్ సెన్స్ బావుంటే చాల మంది మనల్ని ఇష్టపడతారు. ఇక నువ్వు నీ మేకప్ మార్చుకో.. నీ పెదాలకు లైనర్ వాడు అని ఒకరు నాతొ చెప్పారు. ఇక స్టార్ కిడ్స్ కి ఒక సినిమా విడుదల కాకపోయినా.. రెండో సినిమా అవకాశం వస్తుంది.. కానీ మాలాంటి వాళ్ళకి అలా ఉండదు. నటించిన సినిమాతోనే మాలోని టాలెంట్ ని చూపించాలి లేదంటే ఇక అంతే అంటుంది.