Thu Mar 05 2026 17:14:30 GMT+0530 (India Standard Time)
మనసు మార్చుకున్న కృష్ణ కుటుంబీకులు
కృష్ణ కుటుంబీకులు మనసు మార్చుకున్నారు. రాత్రికి నానక్రామ్ గూడలోని ఆయన ఇంటిలోనే భౌతిక కాయాన్ని ఉంచాలని నిర్ణయించారు

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబీకులు మనసు మార్చుకున్నారు. రాత్రికి నానక్రామ్ గూడలోని ఆయన ఇంటిలోనే భౌతిక కాయాన్ని ఉంచాలని నిర్ణయించారు. అంతేకాదు గచ్చిబౌలి స్టేడియంలోకి కృష్ణ భౌతిక కాయాన్ని తీసుకెళ్లాలని తొలుత భావించిన కుటుంబ సభ్యులు ఆ ఆలోచనను విరమించుకున్నారు.
పద్మాలయ స్టూడియోస్ కు...
ఈరోజు రాత్రికి నానక్రామ్గూడలోనే భౌతిక కాయాన్ని ఉంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్ కు తీసుకెళ్లాలని తాజాగా కృష్ణ కుటుంబీకులు నిర్ణయించారు. అభిమానుల సందర్శన కోసం పద్మాలయ స్టూడియోలో పది నుంచి పన్నెండు గంటల వరకూ అనుమతిస్తారు. అనంతరం అక్కడి నుంచి మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
Next Story

