Wed Mar 18 2026 22:24:07 GMT+0530 (India Standard Time)
రేపు మొయినాబాద్ ఫాంహౌస్ లో అంత్యక్రియలు
రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు..

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. పోస్ట్ కోవిడ్ సమస్యలు, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ తో పాటు.. ఊపిరితిత్తులు, కిడ్నీల ఫెయిల్యూర్ కారణంగా కృష్ణంరాజు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. రేపు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నేపథ్యంలో, సీఎస్ సోమేశ్ కుమార్ ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. చిరంజీవి, కేటీఆర్ ప్రభాస్ ను ఓదార్చారు.
Next Story

