Fri Mar 20 2026 00:29:08 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ బయో పిక్ డైరెక్టర్ గా అతడే

బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ ని తనకు నూరవ చిత్రాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి ని సూపర్ హిట్ గా ఇచ్చిన జాగర్లమూడి క్రిష్ కి దర్శకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రోమో ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఇక బాలయ్య ప్రకటనతో పాటుగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అయితే బాలకృష్ణ మార్చ్ ఎండింగ్ లోనే మొదలు పెట్టిన ఎన్టీఆర్ బయో పిక్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడే మొదలు బెడతాడో.. లేదంటే... వినాయక్ చిత్రం తర్వాత మొదలు పెడతాడో క్లారిటీ లేదు. అలాగే.. క్రిష్ బాలీవుడ్ చిత్రం మణికర్ణికా ఇంకా విడుదల కావాల్సి ఉంది.


Next Story

