Sun Mar 15 2026 21:54:49 GMT+0530 (India Standard Time)
కోలివుడ్ నటుడు సత్యరాజ్ కు కరోనా
కోలివుడ్ నటుడు సత్యరాజ్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆయనను పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతోఆసుపత్రిలో చేర్చారు

కోలివుడ్ నటుడు సత్యరాజ్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆయనను పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. చెన్నైలోని అమింజిక్కరైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో సత్యరాజ్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా పాజటివ్ గా తేలింది. వైద్యులు పరీక్షించి హోం ఐసొలేషన్ లో ఉండాలని చెప్పారు.
ప్రయివేటు ఆసుపత్రికి...
అయితే ఆయన పరిస్థితి ఆందోలనగా మారడంతో ఆయనను కుటుంబ సభ్యులు ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. సత్యరాజ్ పరిస్థితి బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story

