Sat Sep 14 2024 23:39:51 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ దేవరకొండ ను సెక్స్ లైఫ్ గురించి తప్ప.. ఇంకే విషయం అడగడా..?
కరణ్ జోహార్ ఈ ఎపిసోడ్ లో ఇంకెన్ని విషయాలను బయట పెట్టాడో..
కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ప్రస్తుతం ప్రసారం అవుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే మూడు ఎపిసోడ్ లలో ఆలియా, రణవీర్, అక్షయ్ కుమార్, సమంత, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్.. సందడి చేశారు. ఎపిసోడ్ 4 లో అనన్య పాండే, విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఈ ఇద్దరు స్టార్లు ఉన్న ప్రోమో.. విడుదలైంది. ఈ ప్రోమో చూస్తే విజయ్ దేవరకొండ సెక్స్ లైఫ్ మీద కరణ్ జోహార్ పలు ప్రశ్నలు వేశాడు. ఇక అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఏమి జరుగుతుందో దాని గురించి తెలుసుకోవాలని కూడా ప్రశ్నలు వేశాడు. విజయ్ దేవరకొండను.. నువ్వు లాస్ట్ టైమ్ సెక్స్ ఎప్పుడు చేశావ్..? త్రీసమ్ అంటే ఇష్టమా.. వంటి ప్రశ్నలను వేసి.. తన షో ఉద్దేశ్యం ఏమిటో మరోసారి బయటపెట్టాడు.
కరణ్ జోహార్ ఈ ఎపిసోడ్ లో ఇంకెన్ని విషయాలను బయట పెట్టాడో.. ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. ఇద్దరు స్టార్ లను సరదాగా పరిచయం చేయడంతో ప్రోమో ప్రారంభమవుతుంది. అనన్యకు, ఆదిత్య రాయ్ కపూర్‌కి మధ్య ఏమి జరుగుతోందని ఆమెను అడిగారు? ఎపిసోడ్ ప్రోమో చూసిన నెటిజన్లు.. కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ సెక్స్ లైఫ్ గురించి తప్ప మరే విషయాన్ని అడిగడా అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లైగర్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఆగష్టు 25 న విడుదలవుతోంది. స్పోర్ట్స్ డ్రామాలో, విజయ్ దేవరకొండ కిక్‌బాక్సర్‌గా కనిపించనున్నాడు. అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా, రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్ లైగర్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైగర్‌లో మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌తో కలిసి, కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
News Summary - Koffee With Karan 7 Ep 4 Vijay Deverakonda Ananya Panday
Next Story