Sat Dec 06 2025 04:28:09 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రమోహన్ అసలు పేరు ఏమిటో తెలుసా?
టాలీవుడ్ లెజెండరీ నటుడు చంద్రమోహన్ నేడు తుదిశ్వాస విడిచారు

టాలీవుడ్ లెజెండరీ నటుడు చంద్రమోహన్ నేడు తుదిశ్వాస విడిచారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కె.విశ్వనాథ్ చంద్రమోహన్ కు బంధువుchan అవుతారు.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాలో నటనకు ఆయనను ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. ఆయన కెరీర్ లో రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు. హీరోగా 175 సినిమాలు చేశారు. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. కమెడియన్ గానూ, కుర్ర హీరోలకు తండ్రి పాత్రల్లో నటించి నవ్వించారు.. ఏడిపించారు.. ఆలోచింపజేశారు. ఫిలింఛాంబర్ ఆప్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసయేషన్, సినీ రంగ ప్రముఖులు చంద్ర మోహన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
Next Story

