Fri Dec 05 2025 08:45:22 GMT+0000 (Coordinated Universal Time)
Kurchi madthapetti song:'కుర్చీని మడతపెట్టి' సాంగ్ లో ఆమెను గుర్తించారా?
గుంటూరు కారం సినిమా నుండి కుర్చీ మడతపెట్టి అంటూ సాగే లిరికల్ వీడియోను

గుంటూరు కారం సినిమా నుండి కుర్చీ మడతపెట్టి అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. శ్రీలీలతో కలిసి మహేశ్ బాబు సూపర్ స్టెప్స్ వేసారు. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. "రాజమండ్రి రాగమంజరి... మా అమ్మ పేరు తెలవనోళ్లు లేరు మేస్తిరీ... సోకులాడి స్వప్న సుందరీ... నీ మడతచూపు మాపటేల మల్లెపందిరీ" అంటూ రామజోగయ్య లిరిక్స్ రాశారు. ఆ లిరిక్స్ శ్రీలీల గురించి అని అనుకున్నా/.(Kurchi madthapetti)ఈ సాంగ్ లో నటి పూర్ణ కనిపించింది. లిరికల్ వీడియోలో ఆమెను రివీల్ చేయలేదు. మొత్తం శ్రీలీలనే చూపించడంతో ఆ లిరిక్స్ ఆమె మీదనే అని అనుకుంటున్నారు. అయితే చివర్లో పూర్ణ కనిపించిందని అభిమానులు పోస్టులు పెట్టారు. దీంతో పూర్ణతో కలిసి మహేష్ బాబు సూపర్ స్టెప్స్ వేసే ఉంటాడని.. ఆ స్టెప్స్ వెండితెర మీద అదిరిపోతాయని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం చిత్రం 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Next Story

