Fri Dec 05 2025 17:33:26 GMT+0000 (Coordinated Universal Time)
పొగరుతో నడిచే మాస్ 'మీటర్'.. కిరణ్ అబ్బవరం నయా మూవీ
చిరంజీవి - హేమలత నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు. తాజాగా మీటర్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది.

టాలీవుడ్ లో ఆచితూచి కథలను ఎంచుకునే హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. SR కల్యాణమండపం తో హీరోగా కెరీర్ మొదలుపెట్టి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. రీసెంట్ గా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం నటనకే పరిమితమవ్వకుండా.. డాన్స్, ఫైట్స్ లలో కూడా ఫర్వాలేదనిపించాడు. తాజాగా మరో సినిమాతో కిరణ్ అబ్బవరం విడుదలకు రెడీ అవుతున్నాడు. అదే మీటర్.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చిరంజీవి - హేమలత నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు. తాజాగా మీటర్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. 'బ్లాస్ట్ కావడానికి ఇది పవర్ తో నడిచే మీటర్ కాదు .. పొగరుతో నడిచే మాస్ మీటర్' అంటూ హీరో చెప్పే డైలాగ్ ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో యాక్షన్ కాస్త ఎక్కువే ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమాతో కోయంబత్తూర్ కి చెందిన 'అతుల్య రవి' కథానాయికగా పరిచయం కాబోతోంది. సాయికార్తీక్ మీటర్ కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏప్రిల్ 7వ తేదీన సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Next Story

