వరుణ్ ముక్కు మీద గుద్దిన కియారా..!
తెలుగులో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పక్కన పాటల్లో గ్లామర్ గా ఆకట్టుకుంది కానీ.. డాన్స్ పరంగా మహేష్ కూడా వీకే కాబట్టి అప్పట్లో కియారా [more]
తెలుగులో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పక్కన పాటల్లో గ్లామర్ గా ఆకట్టుకుంది కానీ.. డాన్స్ పరంగా మహేష్ కూడా వీకే కాబట్టి అప్పట్లో కియారా [more]
తెలుగులో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పక్కన పాటల్లో గ్లామర్ గా ఆకట్టుకుంది కానీ.. డాన్స్ పరంగా మహేష్ కూడా వీకే కాబట్టి అప్పట్లో కియారా డాన్స్ పై ఎలాంటి న్యూస్ రాలేదు. ఇక రామ్ చరణ్ వినయ విధేయ రామాలోను గ్లామర్ గాను డాన్స్ ల పరంగా ఓకె అనిపించినా కియారా ఇప్పుడు ఓ బాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ముందు తేలిపోయింది. లాక్ డౌన్ తో ఫ్రీగా ఉన్న కియారా ఓ డాన్స్ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో లో బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ అయిన వరుణ్ ధావన్ తో కియారా డాన్స్ స్టెప్స్ వేసింది.
వరుణ్ ధావన్ తో కియారా ఏబీసీడీ 2 సినిమాలోని సన్ సాతియా పాటకు రిహార్సల్స్ లో పాల్గొన అప్పటి ఫన్నీ మూమెంట్స్ ని షేర్ చేసింది. అయితే ఆ వీడియో లో కియారా అద్వానీ వరుణ్ స్టెప్స్ తో మ్యాచ్ చెయ్యలేక కాస్త తడబడింది. వరుణ్ ధావన్ డాన్స్ ఇరగదియ్యగా.. వరుణ్ తో రొమాంటిక్ మూవ్మెంట్స్ లో కియారా చాల సార్లు ఫెయిల్ అయ్యింది. అలాగే వరుణ్ ధావన్ ని అనుకోకుండా కియారా ముక్కు మీద గుద్దింది. మరి ఇది కేవలం రిహార్సల్స్. ఒరిజినల్ సాంగ్ లో వరుణ్ ధావన్ శ్రద్ద కాపుర్ తో కలిసి డాన్స్ అదరగొట్టేసిన సంగతి తెలిసిందే.