Sat Dec 07 2024 13:56:13 GMT+0000 (Coordinated Universal Time)
మెగాస్టార్ మంచి మనసు
కేరళ విలయం అందరినీ కలచి వేసింది. వందలాది మంది బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
కేరళ విలయం అందరినీ కలచి వేసింది. వందలాది మంది బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ ప్రభుత్వం కోరుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. టాలివుడ్ హీరోలు భారీగా విరాళాలను ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ లు కలపి కేరళ ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఈ విరాళం పంపుతున్నట్లు మెగాస్టార్ తన మంచి మనసును చాటుకున్నారు.
వాయనాడ్ విషాదంలో....
వాయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి తన గుండె తరుక్కుపోతుందన్న చిరంజీవి బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా కేరళ విలయానికి చలించిపోయారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. టాలివుడ్ హీరోలు మరింత మంది కేరళలోని వాయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.
Next Story