సన్నగా అయితే.. గ్లామర్ షో చేస్తానా?
మహానటి సినిమా కోసం కాస్త లావెక్కిన కీర్తి సురేష్ ఆ బరువుతో చాలా అవకాశాలే కోల్పోయింది. స్టార్ హీరోలు కీర్తి సురేష్ ని మహానటి క్రేజ్ తో [more]
మహానటి సినిమా కోసం కాస్త లావెక్కిన కీర్తి సురేష్ ఆ బరువుతో చాలా అవకాశాలే కోల్పోయింది. స్టార్ హీరోలు కీర్తి సురేష్ ని మహానటి క్రేజ్ తో [more]
మహానటి సినిమా కోసం కాస్త లావెక్కిన కీర్తి సురేష్ ఆ బరువుతో చాలా అవకాశాలే కోల్పోయింది. స్టార్ హీరోలు కీర్తి సురేష్ ని మహానటి క్రేజ్ తో చాలామంది సంప్రదించాలని అనుకున్నప్పటికీ… ఆమె బరువు చూసి వెనకడుగు వెయ్యడంతో మహానటి తరవాత రెండేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే కీర్తి సురేష్ కూడా పరిస్థితిని గమనించి బాగా వరౌట్స్ డైటింగ్ చేసి సన్నగా నాజూగ్గా తయారైంది. దానితో వరస అవకాశాలతో బాగా బిజీగా మారింది. అలాగే కీర్తి సురేష్ ఎప్పుడు ట్రెడిషనల్ గా పద్దతిగా కనబడుతుంది. కానీ సన్నగా తయారయ్యాక కీర్తి సురేష్ గ్లామర్ షో కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…
బికినీ షో కి సై అంటుంది… అంటూ ప్రచారం జరుగుంది. కీర్తి సురేష్ బికిని షో కి, గ్లామర్ షో కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక కీర్తి సురేష్ కెరీర్ పరుగులు పెట్టడమే అంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తలు చదివిన కీర్తి సురేష్ కాస్త ఘాటుగానే స్పందించింది. తానూ గ్లామర్ షో చేస్తా అంటూ వస్తున్న వార్తల్లోనూ, బికినీ షో కి రెడీ అంటున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను బరువు తగ్గి నాజూగ్గా తయారైంది కేవలం సినిమాల్లో అందంగానూ, ఆకర్షణగాను కనిపించడానికి అని.. అంతేకాని బికినీ వెయ్యడానికి కాదు అంటూ మండిపడింది.