Karungali Mala : నెట్టింట ట్రెండింగ్ లో కరుంగలి మాల .. ధరిస్తే సంతోషం మీ వెంటే
ట్రెండింగ్ లోకి కరుంగలి మాల వచ్చేసింది. సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది

సెలబ్రిటీలు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తారు. వారు చేసే ప్రతి పనిని గమనించి వాటినే ఆచరిస్తుంటారు. అందులో సినిమా సెలబ్రిటీలు ఏ పనిచేసినా వాటిని అనుకరించడం అందరికీ అలవాటు. సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. ఒక సినిమా హిట్ అవ్వడానికి కారణం అదే అని భావించి దానినే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్ లోకి కరుంగలి మాల వచ్చేసింది. సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. సినీ హీరోలు పవన్ కల్యాణ్ నుంచి ధనుష్, నానితో కొందరు రాజకీయ నేతలు కూడా ఈ కరుంగలి మాల ధరిస్తున్నారని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి బాలివుడ్ వరకూ సెలబ్రిటీల ఫొటోలతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు వాళ్లు ఎందుకోసం ధరించారో తెలియదు. కానీ ఆ ఫొటోలను చూపి ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియాలో చాలా మంది వ్యాపారాలు మొదలెట్టేశారు. ఎవరి సెంటిమెంట్ వారిది. తప్పులేదు. బాధను బలహీనంగా మలచుకుని క్యాష్ చేసుకోవద్దన్న సూచనలు నెట్టింట కామెంట్స్ వినపడుతున్నాయి.

