Sat Dec 07 2024 23:44:01 GMT+0000 (Coordinated Universal Time)
ఓవర్సీస్ లో కార్తికేయ 2 హవా.. బ్రహ్మరథం పడుతోన్న ప్రేక్షకులు
కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన సినిమా కావడంతో.. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలను క్రియేట్ ..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం కార్తికేయ-2. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన సినిమా కావడంతో.. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో ఆగస్టు 13న విడుదలైన కార్తికేయ 2 సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. భారత్ లోనే కాకుండా.. ఓవర్సీస్ లోనూ కార్తికేయ 2 హవా సాగుతోంది. రెండు వారాల్లో టాలీవుడ్ లో హిట్ కొట్టిన మూడో సినిమా కార్తికేయ 2.
ఓవర్సీస్ ఆడియన్స్.. ముఖ్యంగా అమెరికాలో సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన రెండ్రోజుల్లోనే అక్కడ $450K+ డాలర్లు (మూడున్నర కోట్లకు పైగా) వసూళ్లు రాబట్టింది. వారంరోజుల్లో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుతుందని సినీ క్రిటిక్ ల అంచనా. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2.. తొలి భాగానికి ఏమాత్రం తీసిపోలేదని, ముఖ్యంగా మిస్టరీ సస్పెన్స్ అంశాలు చాలా బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
Next Story