బెబో… సైజు జీరో సీక్రెట్
కరీనా కపూర్… బాలీవుడ్ లో సైజు జీరో ని పరిచయం చేసిన హాట్ హీరోయిన్. చాలా సన్నగా సెక్సీ గా ఉండే క్రీం కపూర్ పెళ్లయ్యాక, పిల్లాడిని [more]
కరీనా కపూర్… బాలీవుడ్ లో సైజు జీరో ని పరిచయం చేసిన హాట్ హీరోయిన్. చాలా సన్నగా సెక్సీ గా ఉండే క్రీం కపూర్ పెళ్లయ్యాక, పిల్లాడిని [more]

కరీనా కపూర్… బాలీవుడ్ లో సైజు జీరో ని పరిచయం చేసిన హాట్ హీరోయిన్. చాలా సన్నగా సెక్సీ గా ఉండే క్రీం కపూర్ పెళ్లయ్యాక, పిల్లాడిని కన్నాక కూడా అదే అందం, అదే సైజు జీరో మెయింటినెన్స్ చూసిన అమ్మాయిలకు మతి పోయింది. తైమూర్ పుట్టిన కొన్ని నెలలకే కరీనా కపూర్ ఎప్పటిలాగా సైజు జీరో కి మారిపోయింది. ఎప్పుడు చూసినా కరీనా కపూర్ జిమ్ లోనే ఉంటుంది, తెగ వర్కౌట్స్ చేస్తుంది అందుకే అంతలా సన్న బడింది బెబో అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక పెళ్లయ్యాక కూడా సినిమాల్లో కెరీర్ కొనసాగిస్తా అని సైఫ్ దగ్గర మాట తీసుకున్న కరీనా పిల్లాడిని కన్నాక కూడా సినిమాలు, హాట్ ఫోటో షూట్స్, కవర్ పేజెస్ అంటూ హడావిడి చేస్తూనే ఉంది.
బికినీ వేసినా, డిజైనర్ డ్రెస్ వేసినా కరీనా సన్నని నడుమందాలు కి ఇప్పటికి బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూజ్ లో నటిస్తున్న కరీనా ఆ సినిమాలో ఓ సాంగ్ కి చేసిన డాన్స్ తెగ వైరల్ అవుతుంది. అయితే కరీనా కపూర్ ఇప్పటికి అంత సన్నగా ఉండడానికి జిమ్ వర్కౌట్ కారణం కాదని, ఆమె తీసుకునే ఆహారమంటున్నారు ఆమె డైటిస్ట్. వారానికి ఐదారు గంటలు మాత్రమే జిమ్ చేస్తుందట కరీనా. కరీనా లేవగానే ఎండు ద్రాక్ష తింటుందని, బ్రేక్ ఫాస్ట్ లో పరాట తింటుందని, లాంచ్ లో పెరుగన్నం, అప్పడం తింటుందని, భోజనానికి ముందు కొబ్బరి నీళ్లు తగ్గుతుందని, ఇంకా ఈవెనింగ్ మిల్క్ షేక్, నైట్ భోజనంలో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తినడం వలన కరీనా ఫిట్ గా ఉందని చెబుతుంది. మరి అంతలాంటి ఆహార నియమాలు పాటించడం వలనే కరీనా బికినీ వేసినా, మోడరన్ డ్రెస్ వేసినా లుక్స్ తోనే అదరగొట్టేస్తుంది

