Fri Dec 05 2025 19:14:26 GMT+0000 (Coordinated Universal Time)
ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
సీనియర్ నటుడు రాజేశ్ (89) వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో ఫిబ్రవరి 9న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. అప్పట్నుంచి

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, సింగర్లు, కమెడియన్లు వరుసగా మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్, గాయకుడు బప్పీ లహరి అనారోగ్య సమస్యలతో మరణించారు. తాజాగా కన్నడ నటుడు మృతి చెందారు. సీనియర్ నటుడు రాజేశ్ (89) వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో ఫిబ్రవరి 9న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. అప్పట్నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిన్న మరింత క్షీణించింది.
ఆస్పత్రి వైద్యులు ఆయనను బ్రతికించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం 2.30 గంటల సమయంలో రాజేశ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని బెంగళూరులోని విద్యారణ్యపురలో ఉన్న నివాసంలో ఉంచారు. మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా.. రాజేశ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Next Story

