ఇంత జరిగినా బుద్ది రాలేదా?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ విదేశాల నుండి వచ్చి,. గవర్నమెంట్ కి ఇంఫార్మ్ చెయ్యకుండానే బాలీవుడ్ ప్రముఖులకు, వివిఐపిలుకు, పొలిటిషన్స్ కి ముంబైలో బడా పార్టీ [more]
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ విదేశాల నుండి వచ్చి,. గవర్నమెంట్ కి ఇంఫార్మ్ చెయ్యకుండానే బాలీవుడ్ ప్రముఖులకు, వివిఐపిలుకు, పొలిటిషన్స్ కి ముంబైలో బడా పార్టీ [more]
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ విదేశాల నుండి వచ్చి,. గవర్నమెంట్ కి ఇంఫార్మ్ చెయ్యకుండానే బాలీవుడ్ ప్రముఖులకు, వివిఐపిలుకు, పొలిటిషన్స్ కి ముంబైలో బడా పార్టీ ఇచ్చింది. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో కనికా కపూర్ ఇలా విదేశీ రాకను దాచిపెట్టి.. పార్టీలు ఇవ్వడంతో సీరియస్ అయినా ప్రభుత్వం కనికా కపూర్ మీద సీరియస్ అవడం.. కనికకి టెస్ట్ చేయించగా ఆమెకి కరోనా లక్షణాలు ఉండంతో ఆమెని లక్నో హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే కనికా కపూర్ చేసింది చాలా తప్పు. అయినా ఆమెకి ఇంకా బుద్ది రాలేదు. తనని హాస్పిటల్ జాయిన్ చేసుకున్న లక్నో హాస్పిటల్ డాక్టర్స్ తనని సరిగా ట్రీట్ చేయడం లేదని. తనకి ఆహారం సరిగ్గా పెట్టడం లేదని, తనకి జ్వరం వచ్చినా ఇంతవరకు మందులు ఇవ్వలేదంటూ… ఓ ఇంగ్లీష్ డైలీ కి సమాచారం అందించింది. అది క్షణాల్లో వైరల్ అయ్యింది.
దానితో కనికా కపూర్ జాయిన్ అయిన లక్నో హాస్పిటల్ డాక్టర్స్ కనికా కపూర్ అభాండాలకు స్పందించారు. కనికా ఇప్పటికైనా సెలెబ్రిటీ లా కాకుండా కరోనా పేషేంట్ లా ట్రీట్ చెయ్యాలని, కొన్నిరోజులు సెలబ్రిటీ అన్న విషయం మరచిపోవాలి.. ఆమె ఓ కరోనా పేషేంట్ లా ప్రవర్తించడం నేర్చుకోవాలని, ఆమెకి వైద్య సహాయం అందిస్తున్నాం అని, హాస్పిటల్ లో ఉన్న అత్యుత్తమమైన సౌకర్యాలు ఆమెకి అందిస్తున్నామని, ఆమె కరోనా పేషేంట్ లా మాకు సహకరించాలని, ఆమె సహకరిస్తేనే తాము ఆమెని ట్రీట్ చేయగలమని, ప్రస్తుతానికి ఆమెకి గ్లూటెన్ ఫ్రీ డైట్ ని అందిస్తున్నామని, బెడ్, టివి, టాయిలెట్ తో కూడిన ఐసోలేటెడ్ రూమ్ ని కనికకి కేటాయించామని పత్రిక ప్రకటన విడుదల చేసారు. మరి కనికా కూడా ఫ్లైట్ వాష్ రూమ్ లో దాక్కుని బయటికి వచ్చి ఇలా పార్టీలంటూ పెంట పెంట చెయ్యడమే కాకుండా కరోనా పేషేంట్ గా ఆమె బాధ్యతలు విస్మరించి.. ఇంకా రచ్చ చేస్తూనే వుంది అంటూ నెటిజెన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.