Mon Dec 09 2024 09:43:14 GMT+0000 (Coordinated Universal Time)
కంగనా రనౌత్ కుటుంబంలో విషాదం
కంగనా రనౌత్ కుటుంబంలో విషాదం నెలకొంది
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కుటుంబంలో విషాదం నెలకొంది. కంగనా రనౌత్ అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ మరణించింది. ఈ విషయాన్ని కంగనా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ధృవీకరించారు. తన జీవితంలో ఆమె ఎలాంటి పాత్ర పోషించారనే విషయాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు కంగనా. ఇంద్రాణి ఠాకూర్ కు 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటుందని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన తన ప్రియమైన నానీని కోల్పోయినందుకు కుటుంబం మొత్తం బాధలో ఉందని వెల్లడించారు. కంగనా తన నానితో కలిసి కూర్చున్న ఫోటోలను పోస్టు చేశారు. తన కుమార్తెలు విద్యావంతులుగా మాత్రమే కాకుండా వివాహానంతరం విజయవంతమైన వృత్తిని కొనసాగించేందుకు ఇంద్రాణి ఠాకూర్ అవిశ్రాంతంగా కృషి చేశారని గుర్తుచేశారు. వృత్తిపరంగా కంగనా రనౌత్ "ఎమర్జెన్సీ" సినిమాలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' తర్వాత కంగనా దర్శకత్వం వహించిన రెండో చిత్రం ఇది.
Next Story