కంగనాని తట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలిలే
కంగనా రనౌత్ బాలీవుడ్ రెబల్ లేడి. ఎవ్వరినైనా మొహం మీదే కడిగి పారేసే మనస్తత్వం కల అమ్మాయి కంగనా. బాలీవుడ్ బడా ప్రముఖులతో రోజూ తగాదా పెట్టుకునే [more]
కంగనా రనౌత్ బాలీవుడ్ రెబల్ లేడి. ఎవ్వరినైనా మొహం మీదే కడిగి పారేసే మనస్తత్వం కల అమ్మాయి కంగనా. బాలీవుడ్ బడా ప్రముఖులతో రోజూ తగాదా పెట్టుకునే [more]

కంగనా రనౌత్ బాలీవుడ్ రెబల్ లేడి. ఎవ్వరినైనా మొహం మీదే కడిగి పారేసే మనస్తత్వం కల అమ్మాయి కంగనా. బాలీవుడ్ బడా ప్రముఖులతో రోజూ తగాదా పెట్టుకునే కంగనా తనకు సేఫ్ అండ్ తనని సపోర్ట్ చేసే నిర్మాతలతోనే సినిమాలు కమిట్ అవుతుంది. అలాగే ఆ నిర్మాతల నుండి తనకి సెక్యురిగా ఉన్న పర్సనల్ సిబ్బందికి కూడా ఖర్చులు రాబట్టగల సత్తా ఉన్న లేడి విలన్ కంగనా. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి లేని శత్రువులు కంగాని సొంతం. అమీర్ ఖాన్ దగ్గరనుండి, కరణ జోహార్, అలియా భట్ ఇలా ఎవ్వరిని వదలని కంగనా కి కాబోయే మొగుడు ఎలాంటి వాడైతే బావుంటుందో ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. అమ్మో ఊహించడానికే భయమేస్తుంది కదూ. అసలే కంగనా ఫైర్ బ్రాండ్.. ఆమె చెల్లి రంగోలి అయితే మరీ దారుణం. ఆమె ఏం మాట్లాడుతుందో.. ఎలా మాట్లాడుతుందో కూడా అర్ధం కాదు .. అంట పచ్చిగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
ఇకపోతే కంగనా పెళ్లి కబుర్లు ఏమిటంటే.. ప్రస్తుతం పంగా అనే కబడ్డీ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్ ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా పంగా దర్శకురాలు అశ్విని తివారి ఆమె భర్త నితీష్ తివారీలా అన్యోన్యం చూస్తుంటే తనకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది.. అయితే తనకి తనకంటే తెలివైన, టాలెంట్ ఉన్న అబ్బాయి అయితే సెట్ అవుతుంది అని చెబుతుంది. మరి కంగనా మనస్త్వత్వాన్ని బట్టి తనకంటే తెలివైనవాడైతేనే కంగనా టార్చెర్ కి సమాధానమిస్తాడు. లేదంటే మూడో రోజే విడాకులకు అప్లై చేస్తాడు.

