Thu Mar 19 2026 04:45:06 GMT+0530 (India Standard Time)
కోలుకున్న కమల్ హాసన్
కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు రెండోసారి కరోనా సోకింది.

కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు రెండోసారి కరోనా సోకింది. ఈ నెల 22వ తేదీన కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి కమల్ హాసన్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో కమల్ హాసన్ చికిత్స పొందుతున్నారు. అయితే కమల్ హాసన్ కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
హోం ఐసొలేషన్ లో....
అయితే కమల్ హాసన్ మరికొద్ది రోజులు హోం ఐసొలేషన్ లోనే ఉండాలని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుందని వైద్యులు చెప్పారు. కమల్ హాసన్ పూర్తిగా కోలుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్నా కమల్ హాసన్ కు కరోనా సోకడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

