Fri Mar 21 2025 07:55:54 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ నుంచి కమల్ హాసన్ అవుట్.. కారణం అదేనా ?
తాజాగా కమల్ హాసన్ షాకింగ్ ప్రకటన చేశారు. తాను తమిళ్ బిగ్ బాస్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కమల్ హాసన్

హిందీలో మొదలైన బిగ్ బాస్ రియాలిటీ షో.. క్రమంగా దక్షిణాదిలో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. హిందీ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ రియాలిటీ షో.. ఆ తర్వాత తమిళ్, తెలుగు వెర్షన్లు కూడా మొదలయ్యాయి. హిందీ బిగ్ బాస్.. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. హిందీ సీజన్లకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. తమిళ్ బిగ్ బాస్ కు కమల్ హాసన్, తెలుగు బిగ్ బాస్ కు నాగార్జున వ్యాఖ్యాతలుగా ఉన్నారు. తాజాగా కమల్ హాసన్ షాకింగ్ ప్రకటన చేశారు. తాను తమిళ్ బిగ్ బాస్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కమల్ హాసన్ "విక్రమ్" అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది.
కానీ.. లాక్ డౌన్, కరోనా ఆంక్షల కారణంగా "విక్రమ్" షూటింగ్ షెడ్యూల్స్ ను రీ షెడ్యూల్ చేయక తప్పలేదు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో బిగ్ బాస్ కోసం కేటాయించాల్సిన డేట్స్ "విక్రమ్" సినిమా కోసం కేటాయించాల్సి వస్తోందని కమల్ హాసన్ పేర్కొన్నారు. "విక్రమ్" షూటింగ్ షెడ్యూల్స్ కారణంగానే ఈ సీజన్ బిగ్ బాస్ హోస్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. కొంతమంది స్టార్స్, టెక్నికల్ పర్సన్స్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు విక్రమ్ షూటింగ్ కోసం కేటాయించాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో బిగ్ బాస్, విక్రమ్ షూటింగ్ రెండింటినీ కలిపి నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తోందని, తనకోసం స్టార్ యాక్టర్స్, టెక్నికల్ పర్సన్స్‌ని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు.
News Summary - Kamal Haasan bids goodbye to Bigg Boss Ultimate, quits as the host
Next Story