Fri Dec 05 2025 17:52:41 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో విక్రమ్ విధ్వంసానికి డేట్ ఫిక్స్
హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విక్రమ్ అందుబాటులోకి రానుంది.

ఈ మధ్యకాలంలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమ్ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ బుధవారం నాడు కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ 'విక్రమ్' యొక్క డిజిటల్ ప్రీమియర్ను ప్రకటిస్తూ ప్రోమోను విడుదల చేసింది. జూలై 8న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విక్రమ్ అందుబాటులోకి రానుంది. తమిళనాడు రాష్ట్రంలో ఐదవ వారంలో కూడా ఈ చిత్రం రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది కమల్ హాసన్ కెరీర్ లోనే సరి కొత్త రికార్డ్లను సృష్టించింది. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వసూళ్లు రూ. 400 కోట్లకు పైగా ఉన్నాయి.
జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.400 కోట్లు రాబట్టింది. ఓటీటీ డీస్నీ+హాట్స్టార్లో జులై 8 నుంచి విక్రమ్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డీస్నీ+హాట్స్టార్ ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడుతూ..'మనకు నచ్చిన చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా చాల్లేదు కదూ. పదండి చూసుకుందాం. డీస్నీ+హాట్స్టార్లో 'అని అంటూ విక్రమ్ స్టైల్ లో గన్ చూపిస్తూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విక్రమ్ అందుబాటులోకి రానుంది.
News Summary - Kamal Haasan announces Vikram’s OTT release date
Next Story

