Sun Mar 22 2026 10:07:52 GMT+0530 (India Standard Time)
అఖిల్ హీరోయిన్ భలే ఛాన్స్ కొట్టేసిందిగా

అఖిల్ రెండో సినిమా హలో అంతగా ఆడకపోయినా అందులో నటించిన అఖిల్ అండ్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కి మంచిపేరు తెచ్చిపెట్టింది. విక్రమ్ కే కుమార్ తనదైన శైలిలో జనాలని ఆకట్టుకోలేకపోయాడు. కానీ తన నటనతో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ యూత్ లో మంచి మార్కులు కొట్టేసింది.
దాంతో యంగ్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తాంది ఈ యంగ్ బ్యూటీ. ఈ అమ్మాయి శర్వానంద్ తాజా చిత్రంలో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం సుధీర్ వర్మ - శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం 1980 నేపథ్యంలో కొనసాగుతుందట.
ఈ మూవీ హీరో శర్వానంద్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు అని టాక్. ఇక హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ పల్లెటూరి పిల్లగా కనిపిస్తుందని చెబుతున్నారు. మరి ఈ పాత్రలో ఈ అమ్మాయి ఏ రేంజ్ లో పెరఫార్మ్ చేస్తుందో చూడాలి.
Next Story

