Sat Dec 07 2024 23:24:20 GMT+0000 (Coordinated Universal Time)
‘డెవిల్’ డైరెక్టర్ ట్వీట్ ఎవరికోసం.. వినాశకాలే విపరీత బుద్ధి..!
'వినాశకాలే విపరీత బుద్ధి' అంటూ కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ డైరెక్టర్. మూవీ విషయంలో విబేధాలు..
నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రస్తుతం 'డెవిల్' (Devil) మూవీలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ స్టోరీ బ్రిటిషర్స్ రూలింగ్ టైములో సాగనుంది. కళ్యాణ్ రామ్ ఒక సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు నవీన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వివాదం బయటపడింది.
తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈనేపథ్యంలోనే మూవీలోని ‘మాయే చేసే’ సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ని ఇస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ లో డైరెక్టర్ నవీన్ పేరుని తొలిగించి, దర్శకుడిగా నిర్మాత అభిషేక నామా తన పేరుని వేసుకున్నాడు. ఇక ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ ట్వీట్ లో అభిషేక్ నామా.. ఎక్కడా దర్శకుడు పేరుని ట్యాగ్ చేయలేదు. ఇక నిర్మాత ఈ పోస్ట్ చేసిన కొంతసమయానికి డైరెక్టర్ నవీన్ తన అకౌంట్ లో ఒక ట్వీట్ వేశాడు.
"వినాశకాలే విపరీత బుద్ధి" అంటూ నవీన్ ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన ఆడియన్స్ కి అసలు దర్శకనిర్మాతల మధ్య ఏం జరిగిందో తెలియడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి మాత్రం దర్శకుడు నవీన్ తప్పుకున్నట్లు మాత్రం అర్ధమవుతుంది. కాగా అభిషేక్ నామా ఇటీవల విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' లాస్ విషయంలో కూడా వైరల్ ట్వీట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు వెంటనే ఈ వివాదం బయటపడడం ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 24న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Next Story