రజిని విలన్ అని టెన్షన్ పడితే.. ఇప్పుడు భానుమతి !!

ప్రస్తుతం సినిమా థియేటర్స్ లో రామ్ చరణ్ 'రంగస్థలం' హవా తగ్గి మహేష్ బాబు 'భరత్ అనే నేను' హావా కొనసాగుతుంది. రెండు సినిమాల డిజాస్టర్స్ తో ఉన్న మహేష్ బాబు 'భరత్ అనే నేను' తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న మహేష్ బాబు 'భరత్ అనే నేను' ఫస్ట్ వీకెండ్ లో ఎంత జోరు కొనసాగించింది.... వీక్ డేస్ లో తన హవాని అలానే కొనసాగిస్తుంది. మరి ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మహేష్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది. అదే విషయాన్ని 'భరత్ అనే నేను' సక్సెస్ మీట్ లో మహేష్ మొహం చూస్తే.. అతని మాట్లాడిన మాటలు చూస్తేనే తెలిసిపోతుంది.
మరో వారం.......
ఫస్ట్ వీకెండ్ లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 57 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. మరి ఈ రేంజ్ లో భరత్ వసూళ్లు ఉంటె 'భరత్ అనే నేను' సినిమా సక్సెస్ సాధించినట్టే. ఈ విధంగా థియేట్రికల్ రన్ ద్వారా భరత్ గనక 100 కోట్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌కు వస్తుంది. మరి ఈ లెక్కన కలెక్షన్స్ రాబట్టాలంటే మరో వారం కూడా థియేటర్స్ లో సరైన సినిమా ఉండకూడదు. కానీ 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి భరత్ కి అడ్డం పడేలా కనబడుతుంది. 'ఫిదా' సినిమాలో మాయ చేసిన సాయి పల్లవి... నానితో కలిసి మళ్ళీ 'ఎంసీఏ' తో హిట్ కొట్టింది. మరి 'ఎంసీఏ' సినిమా నాని క్రేజ్, సాయి పల్లవి క్రేజ్ వలెనే హిట్ అయ్యిందని అందరూ ఒప్పుకున్నారు.
కణం అడ్డం పడుతుందా?
అలాంటి సాయి పల్లవి ఈ శుక్రవారం 'కణం' సినిమాతో థియేటర్స్ లోకి దిగుతుంది. మరి 'ఫిదా, ఎంసీఏ' లతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి భరత్ కలెక్షన్స్ కి అడ్డు కట్ట వేసినా వేస్తుంది అని అంటున్నారు. విజయ్ దర్శకత్వంలో నాగ శౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన 'కణం' సినిమా తెలుగు తమిళంలో వచ్చే శుక్రవారమే విడుదల కాబోతుంది. మరి 'భరత్ అనే నేను' కి రజినికాంత్ విలన్ అని అనుకుని టెన్షన్ పడ్డారు. ఎందుకంటే రజినీకాంత్ 'కాలా' ఈ నెల 27 నే విడుదల కావాల్సి ఉండగా.. అది కాస్త భరత్ కి దారిచ్చి జూన్ 7 కి వెళ్ళిపోయింది. కానీ భరత్ కి రజిని విలన్ అవుతాడనుకుంటే.. ఇప్పుడు భానుమతి అయ్యేలా కనబడుతుంది.

