కాజల్ జంటకి మురాక హోటల్ ఫ్రీ హనీమూన్ ఆఫర్?
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత భర్త గౌతమ్ తో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ చేసుకోవడానికి వెళ్ళిపోయి.. 10 రోజులపాటు అక్కడ బీబత్సం చేసింది. భర్త కిచ్లుతో కలిసి [more]
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత భర్త గౌతమ్ తో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ చేసుకోవడానికి వెళ్ళిపోయి.. 10 రోజులపాటు అక్కడ బీబత్సం చేసింది. భర్త కిచ్లుతో కలిసి [more]
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత భర్త గౌతమ్ తో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ చేసుకోవడానికి వెళ్ళిపోయి.. 10 రోజులపాటు అక్కడ బీబత్సం చేసింది. భర్త కిచ్లుతో కలిసి కాజల్ అగర్వాల్ అండర్ వాటర్ రెస్టారెంట్ లో బస, సముద్రపు అందాల నడుమ లంచ్, అలాగే భర్త గౌతమ్ తో కలిసి హాట్ ఫ్పతో షూట్స్ అబ్బో కాజల్ హాని మూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే కాజల్ హాని మూన్ ఖర్చు విషయంలోనూ తెగ హైలెట్ అయ్యింది. పది రోజుల కోసం 5 కోట్లు ఈ జంట హనీమూన్ కోసం ఖర్చు పెట్టింది అనే న్యూస్ అందరికి షాకిచ్చింది.
అయితే కాజల్ అగర్వాల్ హాని మూన్ కోసం సింగిల్ పైసా ఖర్చు పెట్టలేదట. మాల్దీవుల్లో ఓ హోటల్ వాళ్ళు కాజల్ అగర్వాల్ కి ఫ్రీ హనీమూన్ ఆఫర్ ఇచ్చిందట. అందుకే కాజల్ అగర్వాల్ ఆలా హాని మూన్ ఓ రెచ్చిపోయి మాల్దీవుల రెస్టారెంట్ కి ఫ్రీ పబ్లిసిటీ చేసింది అని అంటున్నారు. ఇంతకీ కాజల్ కి ఆ ఆఫర్ ఇచ్చిన రెస్టారెంట్ ఏది అంటే.. ద మురాక రెస్టారెంట్ అంట. అంటే అండర్ వాటర్ రెస్టారెంట్ అన్నమాట. కాజల్ సముద్రపు అడుగున ఉన్న మురాక రెస్టారెంట్ లో పది రోజులపాటు ఎంజాయ్ చేసింది. దాని కోసం ఐదు కోట్ల ఖర్చు అయ్యేది,. కానీ కాజల్ జంట అక్కడ ఫ్రీగా ఎంజాయ్ చేసిందట.
కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో 16 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉండడంతో ఆ మురాక రెస్టారెంట్ కాజల్ కి అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఇన్స్టా లో రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉంటె.. అక్కడ ఫుడ్ ఫ్రీ, ఐదు మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే.. హోటల్ రూమ్స్ ఫ్రీ. మరి 16 మిలియన్ ఫాలోవర్స్ కి ఉన్న కాజల్ కి ఫ్రీ హాని మూన్ ఇచ్చిందన్నమాట. అదన్నమాట కాజల్ హనీమూన్ వెనుకున్న రహస్యం.