అల్లరితో.. కాజల్ ఫిక్స్.. ఇది గాసిప్ కాదు
గత రెండు మూడు రోజులుగా కాజల్ అగర్వాల్ రేంజ్ అల్ల్లరి నరేష్ కి పడిపోయింది.. అవకాశాలు లేని కాజల్ అగర్వాల్ చిన్న హీరో అల్లరి నరేష్ తో [more]
గత రెండు మూడు రోజులుగా కాజల్ అగర్వాల్ రేంజ్ అల్ల్లరి నరేష్ కి పడిపోయింది.. అవకాశాలు లేని కాజల్ అగర్వాల్ చిన్న హీరో అల్లరి నరేష్ తో [more]
గత రెండు మూడు రోజులుగా కాజల్ అగర్వాల్ రేంజ్ అల్ల్లరి నరేష్ కి పడిపోయింది.. అవకాశాలు లేని కాజల్ అగర్వాల్ చిన్న హీరో అల్లరి నరేష్ తో కలిసి హీరోయిన్ గా నటిస్తుంది.. ఇలా మీడియాలో వస్తున్న వార్తలు. ఎందుకంటే ప్రస్తుతం ఫామ్ లో లేని అల్లరి నరేష్ అవకాశాల కోసం చూస్తున్నాడు. కనీసం కేరెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తినా మహర్షి తో వర్కౌట్ అవ్వలేదు. అందుకే అల్ల్లరి ఇప్పుడు హీరోగా మళ్ళి ఛాన్స్ లు వెతుక్కునే పనిలో ఉండడం, అల్లరి నరేష్ రేంజ్ కమెడియన్ కి ఎక్కువ హీరో కి తక్కువ అందుకే కాజల్ ఎలా ఒప్పుకుందో అనుకున్నారు.. నిజంగానే తెలుగులో అవకాశాలు లేని కాజల్ అల్లరి నరేష్ సినిమా ఒప్పుకుంది అన్నారు. అయితే తాజాగా అల్లరి నరేష్ సినిమాలో కాజల్ అగర్వాల్ ఫిక్స్ అంట. ఈ విషయాన్నీ ప్రముఖ నిర్మాత సురేష్ బాబే స్వయంగా చెబుతున్న మాట. అల్లరి నరేష్ కాజల్ జంటగా ఓ కొరియన్ మూవీ రీమేక్ చెయ్యనున్నట్లుగా చెబుతున్నారు.
డాన్స్ఇంగ్ క్వీన్ అనే కొరియన్ మూవీ ని రీమేక్ చేయబోతున్నట్లుగా.. ఈ సినిమా ఓ జంట కథ అని.. ఆ జంట తమ నిజ జీవితం లో సమస్యలని ఎదుర్కొని.. తమ లక్ష్యాన్ని ఎలా చేదించిందో అనేది సినిమా కథ అంటున్నారు. ఇక హీరోగా అల్లరి నరేష్ ఓకె. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని సంప్రదించగా.. కథ నచ్చిన కాజల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సురేష్ బాబు చెబుతున్నాడు. ఇక కాజల్ అగర్వాల్ ఓ హిందీ సినిమాతో పాటుగా.. కమల్ హాసన్ భారతీయుడు 2 అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ క్వీన్ రీమేక్ పారిస్ పారిష్ షూటింగ్ పూర్తి చేసుకుని ఏడాదైనా సినిమా ఎప్పుడు విడుదలకాబోతుందో అనేది కాజల్ కి కూడా తెలిసినట్లుగా లేదు.