Fri Dec 05 2025 17:50:28 GMT+0000 (Coordinated Universal Time)
Pavala Shyamala : దీనస్థితిలో నటి పావలా శ్యామల.. కాదంబరి సాయం..
వృద్ధాశ్రమంలో దీనస్థితిలో జీవనం సాగిస్తున్న నటి పావలా శ్యామలకు కాదంబరి కిరణ్ సహాయం.

Pavala Shyamala : ఒకప్పటి తెలుగు చిత్రాల్లో లేడీ కమెడియన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేసిన నటి పావలా శ్యామల.. గత కొంతకాలం అనారోగ్యం, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసు సహకరించక సినిమాలకు దూరమైన శ్యామల.. ఇటు తన అనారోగ్యంతో, అటు కూతురు అనారోగ్యం సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధాశ్రమంలో దీనస్థితిలో జీవనం సాగిస్తూ వస్తున్నారు.
ఇక ప్రస్తుతం శ్యామల పరిస్థితిని ఒక మీడియా ద్వారా తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్.. ఆమెకు ఆర్ధిక సాయం అందించారు. తెలుగు నటుడు కాదంబరి కిరణ్ ‘మనం సైతం' అనే ఫౌండేషన్ ద్వారా గత 10 ఏళ్ళ పై నుంచి.. సినీ పేద కార్మికులకు, కష్టాల్లో పేదలకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు శ్యామల పరిస్థితి తెలుసుకున్న కాదంబరి కిరణ్.. ఆమెను వెతుకుంటూ వెళ్లి సహాయం చేశారు.
హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న పావలా శ్యామలని కలుసుకొని ఆమె రూ.25,000 నగదుని చెక్ రూపంలో అందించి సహాయం చేశారు. ఆమెకు కావాల్సిన కనీస అవసరాలు, మెరుగైన వైద్యం కలిగేలా చేయూతని అందించారు. ఇక ఒకప్పుడు అందర్నీ నవ్వించిన నటి శ్యామలని ఈ పరిస్థితిలో చూసిన ఆడియన్స్ తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహాయం అందించిన కాదంబరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story

