Wed Mar 18 2026 20:07:18 GMT+0530 (India Standard Time)
కాలా కలెక్షన్లు ఎలా ఉన్నాయి...?

జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రజనీకాంత్ కాలా చిత్రం రజనీ స్థాయికి తగ్గ కలెక్షన్లను రాబట్టలేకపోతోంది. ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.112.2 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరింది. రజనీకాంత్ గత సినిమా కబాలి కూడా ఇదే దర్శకుడితో తీయడం, అది విఫలం కావడం కూడా కాలా సినిమా కలెక్షన్లను దెబ్బ కొట్టింది. ఈ వారాంతంలో కాలా చెన్నైలో రూ.7.23 కోట్ల వసూలు చేయగా, మొత్తం తమిళనాడులో రూ.44.8 కోట్లు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్లు, కర్ణాటకలో సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురై ఆలస్యమైనా రూ.8.3 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.39.5 కోట్లు వసూలు చేసి ఫరవాలేదు అనిపించింది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రం ముంబైలోని ధారాని మురికివాడ నేపథ్యంలో రజనీకాంత్(కాలా), నానా పటేకర్(హరి దాదా)కు మధ్య జరిగే పోరాటంపై తెరకెక్కింది.
Next Story

