Thu Mar 19 2026 07:21:37 GMT+0530 (India Standard Time)
కె. విశ్వనాథ్, నారాయణమూర్తిలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ అచీవ్మెంట్ అవార్డు
తనకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడంపై ఆర్. నారాయణమూర్తి స్పందించారు. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ..

ఏపీ ప్రభుత్వం గతేడాది నుంచి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారాలను అందిస్తున్నారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన సుమారు 30 మందికి ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఏడాది సినిమా రంగానికి సంబంధించి.. కళాతపస్వి కె.విశ్వనాథ్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి లకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించారు. నవంబర్ 1వ తేదీన ఇరువురికి ఈ అవార్డును అందజేయనున్నారు.
తనకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడంపై ఆర్. నారాయణమూర్తి స్పందించారు. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తనకు, విశ్వనాథ్ గారికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలని చూపిస్తూ ప్రజా చిత్రాలని తీస్తున్న తనను ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ గుర్తించి.. తనకు వైఎస్సార్ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Next Story

