Sat Nov 02 2024 09:12:02 GMT+0000 (Coordinated Universal Time)
Junior Ntr : తారక్ ఎంత లక్కీ ఫెలో.. థాంక్ గాడ్....మరో వారం అక్కడే ఉంటే?
జూనియర్ ఎన్టీఆర్ గత వారం జపాన్ లో కుటుంబ సభ్యులతో పర్యటించి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ భూకంపం సంభవించింది.
జూనియర్ ఎన్టీఆర్కు సినిమాల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. తారక్ ఫ్యాన్స్ కోట్ల సంఖ్యలో ఉంటారు. తారక్ ప్రతి అడుగునూ నిశితంగా గమనిస్తుంటారు. తారక్ సినిమాల అప్డేట్ కోసం నిత్యం ఎదురు చూసేవారు లక్షల్లో ఉంటారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ విషయం తెలిసి ఇప్పుడు అభిమానులు కూడా ఒకింత ఆందోళన.. మరొకరకంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జపాన్ లో భూకంపం జరిగిన సమయానికి వారం రోజుల ముందు తారక్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. ప్రతి ఏటా సినిమా షూటింగ్ విరామ సమయంలో తారక్ తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
కుటుంబ సభ్యులతో కలసి...
అందులో భాగంగా గత వారం క్రితం తారక్ జపాన్ వెళ్లారు. అయితే ఆయన సోమవారమే తిరిగి హైదరాబాద్ వచ్చారు. గత వారమంతా జపాన్ లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడిపిన తారక్ అలా వచ్చిన వెంటనే అక్కడ భూకంపం సంభవించడం ఒకింత ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. గత వారమంతా తాను అక్కడే ఉన్నానని, ఆ ప్రాంతంలోనే భూకంపం సంభవించడం తన హృదయాన్ని కలచి వేసిందని తారక్ పేర్కొనడంతో ఫ్యాన్స్ ఒకింత ఆందోళనకు గురయ్యి.. తిరిగి ఆయన హైదరాబాద్ కు వచ్చేశారని తెలుసుకుని హ్యాపీ ఫీలవుతున్నారు.
Next Story