Fri Dec 05 2025 11:30:52 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ఈ నెలలో ట్రైలర్.. వచ్చే నెలలోనే విడుదల
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వచ్చే నెలలో తీపి కబురు అందనుంది

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వచ్చే నెలలో తీపి కబురు అందనుంది. ఆయన మూవీ కోసం నందమూరి ఫ్యాస్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే వచ్చే నెలలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2 సినిమా విడుదల కానుంది. మేకర్స్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. వచ్చే నెలలో విడుదయ్యే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభయ్యే అవకాశాలున్నాయి.
ఇద్దరూ ఉద్దండుల మధ్య...
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు నటిస్తున్న వార్ 2 సినిమా ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇద్దరూ ఉద్దండు నటులు కావడంతో పాటు యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే సినిమా కావడంతో ఖచ్చితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని భఆవిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. ఇందులో కియా అద్వాణీ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ నెల 25వ తేదీన...
ఇక వార్ -2 సినిమా మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇద్దరూ యువ నటులు కావడంతో వారి మధ్య జరిగే వార్ అభిమానులకు కన్నుల పండువగా ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మూడు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ కొడుతుందని భావిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన విడులయ్యే ట్రైలర్ తోనే ఒక రేంజ్ కు వెళుతుందని అంచనాల మధ్య విడుదలయ్యే సినిమా అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు.
Next Story

