Wed Dec 17 2025 14:12:54 GMT+0000 (Coordinated Universal Time)
7 రోజుల్లో రూ.700 కోట్లు కొల్లగొట్టిన RRR
తారక్-చరణ్ కీలక పాత్రలు పోషించగా.. అజయ్ దేవగణ్, శ్రియా, అలియాభట్, ఒలీవియా మోరిస్, రాహుల్ రామకృష్ణ..

హైదరాబాద్ : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా RRR నిలిచిపోనుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR ఊహించని కలెక్షన్లు రాబడుతూ.. అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. కొందరు పనిగట్టుకుని సినిమాపై నెగిటివ్ టాక్ సృష్టించినా.. అవేవీ కలెక్షన్లపై ప్రభావం చూపలేకపోయాయి. తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ, విదేశాల్లో RRR హవా కొనసాగుతోంది. తొలి మూడ్రోజుల్లో రూ.500 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన RRR.. ఏడు రోజుల్లో రూ.700 కోట్లు వసూలు చేసింది.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. పోస్టర్ ను విడుదల చేశారు. తారక్-చరణ్ కీలక పాత్రలు పోషించగా.. అజయ్ దేవగణ్, శ్రియా, అలియాభట్, ఒలీవియా మోరిస్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి వారం పూర్తయ్యే సరికి RRR రూ.710కోట్లు వసూలు చేసింది. సెంథిల్ కెమెరా పనితనం, కీరవాణి పాటలు, కొరియో గ్రఫీ, కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ ఇవన్నీ RRR సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సినిమాలో అందరి పాత్రలను రాజమౌళి డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలను నడిపించిన తీరు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు. ఈవారం పండుగలు ఉండటం, వరుస సెలవులు కూడా ఉండటంతో RRR కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ఆకాంక్షిస్తున్నారు.
Next Story

