Wed Oct 16 2024 03:24:27 GMT+0000 (Coordinated Universal Time)
Devara Run Time: దేవర సెన్సార్ రిపోర్ట్.. సినిమా ఎన్ని గంటలు ఉందంటే?
ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా టాలీవుడ్ మోస్ట్ ఎవైటింగ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేవర ట్రైలర్ 24 గంటల్లో 55 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా దేవర సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. దేవర కు U/A సర్టిఫికేట్ రాగా.. చిత్రం రన్‌టైమ్ 177.58 నిమిషాలు. అంటే 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లతో సినిమాను లాక్ చేశారు. ఈ చిత్రం సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఉన్నట్లు ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘దేవర’ లో మాస్ లుక్ లో ఎన్టీఆర్ అలరించబోతున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆమె తెలుగులోకి అరంగేట్రం చేసింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. 'యానిమల్'లో చివరిగా కనిపించిన బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యాడు. అతడి రోల్ ను ఇంకా రివీల్ చేయలేదు. రెండో పార్ట్‌లో అతడి పాత్రకు స్కోప్ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవర’.
తారక్ ఈ సినిమా తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 2’, ‘సాలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘యంగ్ టైగర్’ కూడా జతకట్టనున్నాడు.
తారక్ ఈ సినిమా తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 2’, ‘సాలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘యంగ్ టైగర్’ కూడా జతకట్టనున్నాడు.
Next Story