Fri Mar 20 2026 06:20:23 GMT+0530 (India Standard Time)
మానవత్వం చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్

తిత్లీ తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో సంపూర్ణేష్ బాబు ముందుండి రూ.50 వేలు తనవంతుగా విరాళం అందించాడు. తర్వాత విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, ఆయన సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. దర్శకుడు అనిల్ రావిపూడి రూ.1 లక్ష విరాళం ప్రకటించాడు.
Next Story

